![]() |
![]() |
.webp)
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -386 లో....దీప, కార్తీక్ కిచెన్ లో ఉంటారు. అప్పుడే పారిజాతం కిచెన్ లోకి వచ్చి.. రెండు ఫిల్టర్ కాఫీ తీసుకొని రా అని చెప్తుంది. సరే అంటూ పారిజాతంతో వెటకారంగా మాట్లాడతాడు కార్తీక్. అప్పుడే జ్యోత్స్న వచ్చి.. ఏంటి కిచెన్ లో మీ సోది అని పని చేయకుండా అని అంటుంది. అంటే ఫిల్టర్ కాఫీ బాగోకపోతే మళ్ళీ కిచెన్ లోకి విసిరేస్తారు కదా అని పారిజాతం అనగానే ఖచ్చితంగా అదే జరుగుతుందని జ్యోత్స్న అంటుంది. చెప్పుతో కొడుతానని కార్తీక్ అనగానే పారిజాతం జ్యోత్స్న బిత్తెరపోయి చూస్తారు.
ఇప్పుడు ఏమన్నవ్ జ్యోత్స్నని చెప్పుతో కొడుతావా అని పారిజాతం అనగానే.. కాదు పాలు పోసినోడిని అన్నాను.. పాలు చిక్కగా ఉంటేనే కదా టీ బాగుండేది అని కార్తీక్ కవర్ చేస్తాడు. బావ నీకు కూడ కాఫీ పెట్టాలా అని దీప అనగానే.. పారిజాతం, జ్యోత్స్న షాక్ అవుతారు. ఏమని పిలిచావని జ్యోత్స్న అడుగుతుంది. బావ అని పిలిచింది.. అయిన పనివాళ్ళ పిలుపులతో మీకేంటి సంబంధమని కార్తీక్ అంటాడు. అలా దీప పిలవకూడదని జ్యోత్స్న గొడవ చేస్తుంది. ఆ తర్వాత దీపని కార్తీక్ బంగారమని పిలుస్తాడు. దానికి కూడా జ్యోత్స్న, పారిజాతం గొడవ చేస్తారు.
ఆ తర్వాత ఏదో జరుగిందని జ్యోత్స్న అంటుంటే ఏదో నిన్ను ఆటపట్టించడానికి అలా పిలుచుకుంటున్నారని పారిజాతం అంటుంది. అయిన జ్యోత్స్న పట్టించుకోకుండా దాస్ నిజం చెప్పేసి ఉంటాడా అని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటే సుమిత్రకి జ్యోత్స్న బయట నుండి భోజనం తెప్పిస్తుంది. ఆ భోజనాన్ని దీప కిందపడేసినట్లు జ్యోత్స్న క్రియేట్ చేస్తుంది. దాంతో మళ్ళీ దీపని సుమిత్ర తిట్టేలా చేస్తుంది. దాంతో దీప పక్కకు వచ్చి బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |